ముస్లిం దేశంలో ఘనంగా దుర్గా పూజ వేడుకలు ముగిసాయి…!

-

బంగ్లాదేశ్ లో దుర్గా పూజ వేడుకలు ముగిసాయి అని అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలో విగ్రహాలను నిమజ్జనం చేయడంతో దుర్గా పూజ ఐదు రోజుల సుదీర్ఘ వేడుక సోమవారం ముగిసింది అని అధికారులు చెప్పారు. ఈ నెల 22 న వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది.

ఈ సంవత్సరం కుమారి పూజ, శిదూర్ ఖేలా, ధుంచి నృత్య పోటీ మరియు ‘శోభాజత్రా’ అనే ఊరేగింపు వంటి అనేక సాధారణ కార్యకలాపాలు నిర్వహించలేదు. రాజధాని నగరంలో డాకాలో మధ్యాహ్నం ఊరేగింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులకు పోలీసులు సూచనలు చేసారు. దుర్గా పూజ బంగ్లాదేశ్ హిందువుల అతిపెద్ద పండుగ. పూజను బంగ్లాదేశ్‌లో 30,223 మండపాలలో నిర్వహించారు, ఇది గత సంవత్సరం 31,398 తో పోలిస్తే తక్కువ.

Read more RELATED
Recommended to you

Latest news