సరికొత్త అప్డేట్ ను తీసుకోని వచ్చిన వాట్సాప్..!

-

ఇప్పుడు అందరు మొబైల్ ఫోన్స్ లో వాట్సాప్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ కామన్ అయిపోయాయి. ఈ యాప్స్ ను అందరు విరివిగా వాడడం వల్ల సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఇప్పుడు వాట్సాప్ అప్ వాడే యూజర్లకు ఒక శుభవార్త. ఒక సరికొత్త అప్డేట్ తో మన ముందుకు రాబోతుంది. వివరాలలోకి వెళితే Whatsapp రోజు రోజుకు సరికొత్త అప్డేట్స్ తో యూజర్ల ముందుకొస్తుంది. దీనిలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే యూజర్లు తమ వాట్సాప్ యాప్‌ను అన్‌లాక్ చేయడానికి ఫేస్ అన్ లాక్ ఆప్షన్ ను రూపొందిస్తోంది.ఇప్పటిదాకా కేవలం ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ తోనే లాక్ వేసేవాళ్ళము.. కానీ ఇప్పుడు ఫేస్ అన్ లాక్ కూడా రాబోతుంది అన్నమాట… అయితే ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

రానున్న రోజుల్లో ఈ Face Unlock ఆప్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ లో భాగంగా ఉన్న ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ వంటి రెండు ఫీచర్లు ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం కేవలం ఫింగర్ ప్రింట్ అన్ లాక్ ఫీచర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ అప్ తీసుకురానున్న ఈ నూతన అప్ డేట్ కు సంబంధించిన వివరాలను WABetaInfo తన నివేదికలో పేర్కొంది.

Face Unlock ఆప్షన్ వాట్సాప్ అప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాక ఇప్పటికే ఉన్న ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ ‘బయోమెట్రిక్ లాక్’గా మార్చబడుతుంది. ఎందుకంటే, ఈ నూతన ఫీచర్ అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్ యూజర్ ను గుర్తించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి. ఒకవేళ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ తో యూజర్ గుర్తింపు విఫలమైతే వాట్సాప్ ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తుంది. అయితే, ప్రస్తుతం, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ పనిచేయకపోతే వాట్సాప్ తెరవడానికి మరో మార్గం లేదు. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ నూతన అప్డేట్ ఎప్పుడు అందుబాటులోకి రానుందన్న విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.మరి ఈ ఆప్షన్ ఎప్పుడు అందుబాటులోకి రానుందో చూడాలి మరి.. !!

Read more RELATED
Recommended to you

Latest news