మిజోరంలో భూకంపం… రిక్టర్ స్కేల్ పై 6.1గా తీవ్రతం

-

ఈశాన్య రాష్ట్రం మరోసారి భూకంపంతో వణికింది. ఇటీవల కాలంలో భారత్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అస్సాం, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో ఇటీవల భూకంపాలు ఏర్పడ్డాయి. తాజా ఈరోజు మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్​సీఎస్​) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. తెంజావల్​కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

ఇదిలా ఉంటే మరోవైపు మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్ బార్డర్ లో కూడా భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు 183 కిలొమీటర్ల దూరంలో భూమి నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేల్ పై 6.6గా భూకంప తీవ్రత నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news