బ్రేకింగ్ : అండమాన్ దీవుల్లో భూకంపం. పరుగులు పెట్టిన ప్రజలు

-

అర్థరాత్రి ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో స్వల్ప భూకంపం వచ్చింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని క్యాంప్‌బెల్‌ బే వద్ద భూమి కంపించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదయిందని తెలిపింది. క్యాంప్‌బెల్‌ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నదని పేర్కొంది. కాగా, అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

4.5 magnitude earthquake rocks Andaman and Nicobar Islands | Skymet Weather  Services

అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అండమాన్‌ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండో సారి. ఏప్రిల్‌ 30న డిగ్లిపూర్‌లో 11.04 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది. కాగా, గత నెల 10న కూడా భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యాన 70 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news