అన్నిటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే దేనినైనా మనం పొందొచ్చు. ఆరోగ్యంగా ఉండడానికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి మొదలు బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు బాదం ద్వారా మనం పొందొచ్చు. అయితే ఈ రోజు బాదంకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
గర్భిణీలకు సైతం బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణీలు బాదం రెగ్యులర్ గా తినడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదే విధంగా బాదంలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. మన రక్తం లో చేరిన టాక్సిన్స్ ని, హానికరమైన మలినాలని శరీరం నుండి ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తాయి. వీటిలో విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అల్జీమర్ వంటి సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది.
అందమైన చర్మం కోసం బాదం:
అందమైన చర్మం పొందాలి అంటే బాదం బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడం వల్ల మీ చర్మం అందంగా మారుతుంది. అలానే ముడతలు కూడా ఉండవు.
డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది బాదం:
మెగ్నీషియం ఒంట్లో తక్కువగా ఉండే వాళ్లలో డయాబెటిస్ ఎక్కువగా ఉంటుంది. బాదం లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కనుక డయాబెటిస్ సమస్య నుండి బయట పడడానికి రెగ్యులర్ గా దీనిని తీసుకోండి. దీనితో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేస్తుంది బాదం:
రోజూ బాదం తీసుకోవడం వల్ల రక్తంలోని హై డెన్సిటీ లిపొప్రోటీన్స్ కొలెస్ట్రాల్, డెన్సిటీ లిపొప్రోటీన్స్ కొలెస్ట్రాల్ మధ్య బ్యాలెన్స్ అనేది ఉంటుంది. దీని ఫలితంగా మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. అంతే కాదండి బాదంలో విటమిన్ ఏ, విటమిన్ డి, బి1, బి2, బి6, ఉంటాయి. వీటి వల్ల జుట్టు దృఢంగా ఉంటుంది.