Breaking : కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటి సోదాలు

-

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మైనింగ్ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు కరీంనగర్, హైదరాబాదులో కొనసాగుతున్నాయి. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ 30 టీమ్స్‌తో సోదాలు చేస్తోంది. అయితే.. గతంలో కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడానికి సీబీఐ అంగీకరించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుండి వైజాగ్ బ్రాంచ్‌కు సమాచారం అందింది. సీబీఐ వైజాగ్ బ్రాంచ్ కు చెందిన అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ED raids 6 locations across Delhi, UP in religious conversion PMLA case |  Latest News India - Hindustan Times

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రానైట్ ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ కలిగిన రాయిగా పేరుంది. చైనా లో జరిగినటువంటి ఒలంపిక్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ముఖ్యమైన నిర్మాణాల్లో ఈ గ్రానైట్ ని ఇంటీరియర్ గా వాడుతుంటారు. అయితే 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించినటువంటి అధికారులకు ఈ గ్రానైట్ ను విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో కరీంనగర్ కు చెందిన అనేక సంస్థలకు నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు పెద్ద ఎత్తున జరిమానా విధించారు.

మొత్తం జరిమానా దాదాపు 750 కోట్ల వరకు ఉంది. ఇంత భారీ ఎత్తున జరిమానా విధించడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది .దీనిపై ఇప్పటికీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ కొనసాగుతోంది .అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఈ అక్రమ రవాణా వ్యవహారం ఎంతమాత్రం ముగియలేదని… ఇప్పటికీ అనుమతులు లేకుండానే ఎక్స్పోర్ట్ జరుగుతోందని పేరాల శేఖర్ రావు తన కంప్లైంట్లో పేర్కొనడంతో మళ్లీ దీనిపై విచారణకు ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీబీఐ దర్యాప్తు సంస్త ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news