అర్జున్​ సినిమాకు ఆ హీరో గ్రీన్​సిగ్నల్​..!

-

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా విశ్వక్​ సేన్​తో ఓ మూవీ షురూ చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇందులో హీరోయిన్. ఇటీవలే విశ్వక్​-అర్జున్​లకు మధ్య విభేదాలు రావడంతో ఈ మూవీ క్యాన్సిల్ అయింది. ఇక అర్జున్ తన మూవీకి మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ మూవీని శర్వానంద్​తో తీయాలనుకుంటున్నట్లు టాలీవుడ్​లో గుసగుస వినిపిస్తోంది. శర్వాకు ఈ స్టోరీ బాగా సెట్ అవుతుందని అర్జున్ భావిస్తున్నాడట. అందుకే ఈ మూవీ గురించి శర్వానంద్​తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.

ఇటీవలే ఒకే ఒక జీవితంతో మంచి కంబ్యాక్‌ ఇచ్చాడు శర్వానంద్. దాదాపు ఆరు ఫ్లాపుల తర్వాత ఈ సినిమా శర్వాకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ క్రమంలో శర్వా కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట. కథను ఒకే చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలో అర్జున్ కథను శర్వా యాక్సెప్ట్‌ చేస్తాడా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందులోనూ ఇంత పెద్ద వివాదం తర్వాత అర్జున్‌కు ఓకే చెప్తాడా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news