BED చదివి టీచర్ లుగా ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడాలి అనుకునే వారు మొదటగా ఎడ్ సెట్ పరీక్ష రాసి కాలేజీలలో చదవాల్సి ఉంది. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చాలా రోజులు అయింది, అయినప్పటికీ వివిధ కారణాల వలన చాలా మంది అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోలేదు. అందుకోసం మరోసారి ఎడ్ సెట్ కోసం దార్కాహస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. కాగా ఇప్పటికే రెండు సార్లు ఈ గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత ఆలస్యం అయినప్పటికీ అభ్యర్థుల దగ్గర నుండి ఎటువంటి ఎక్స్ట్రా ఫి కలెక్ట్ చేయకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది.
ఈ ప్రవేశ పరీక్షకు జనరల్ మరియు బీసీ విద్యార్థులు రూ. 700 మరియు ఎస్సీ , ఎస్టీ మరియు వికలాంగ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. మే 5వ తేదీన హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ పరీక్షను మే 18 న నిర్వహించనున్నారు.