ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ బిజెపి – బిఆర్ఎస్ నాటకంలో భాగమేనన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రెండు పార్టీలది మిత్రభేదమే అంటూ మండిపడ్డారు. వాటాల పంపకంలో తేడా రావడం వల్లే చిల్లర పంచాయితీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీని ఈడి విచారించినప్పుడు కవిత, కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో మేము ఓట్లు అడగమని.. ఇవ్వకపోతే బిఆర్ఎస్ అడగొద్దంటూ ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవన్న రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు.