హైదరాబాద్​లో ఇవాళ మరోసారి ఈడీ సోదాలు

-

దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తోంది. 10రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు రెండోసారి సోదాలు జరిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి నాలుగు బృందాలుగా అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 40చోట్ల తనిఖీలు జరిపారు. తెలుగు రాష్ట్రాలు సహా చెన్నైలోని 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి… స్థానిక అధికారులతో కలిసి తనిఖీలకు వెళ్లారు. లిక్కర్‌ పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తోంది..

ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్’ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. తాజాగా మరోసారి దాడులను ఉద్ధృతం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news