విజయ్‌పై ఈడీ గురి ..లైగర్ పెట్టుబడులపై ట్విస్ట్‌లు..!

-

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ దూకుడు కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల లక్ష్యంగా ఈడీతో పాటు, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మధ్యలో సి‌బిఐ మెరుపులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో లైగర్ సినిమా పెట్టుబడులపై ఊహించని ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు నిర్మాతలు ఛార్మీ, కరణ్ జోహర్‌..కానీ అనధికారికంగా ఇందులో కొందరు రాజకీయ ప్రముఖు పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ నేతా బక్కా జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఆ మధ్య డైరక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీని ఈడీ విచారించింది. అలాగే ఇటీవల హీరో విజయ్ దేవరకొండకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈడీ విచారణకు విజయ్ హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన పెట్టుబడులపై ఈడీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. లైగర్ సినిమాకు రాజకీయ నేతల నుంచి భారీగా అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని జడ్సన్ ఫిర్యాదు చేశారు. పలు దర్యాప్తు సంస్థలకు జడ్సన్ కొన్ని పత్రాలను సమర్పించారు. లైగర్‌కు తెలంగాణలోని ఓ ప్రముఖ నేత పెట్టుబడి పెట్టి ఆధారాలను అందించారు.

నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే ప్రక్రియలో భాగంగా లైగర్ సినిమాకు ఫైనాన్స్ చేశారని, ఈ సినిమా నిర్మాణానికి అక్రమంగా డబ్బు తరలించారని,  కేవలం లైగర్ సినిమా కోసమే కాకుండా జనగణమన సినిమా కోసం కూడా రాష్ట్రంలోని రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి..ఫిర్యాదులు అందాయి.

ఇప్పటికే ఈడీ ఈ కేసుకు సంబంధించి పూరీ, ఛార్మిలని విచారిచింది..గాని వారు మీడియాకి ఏం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు విజయ్ విచారణకు హాజరయ్యారు. మరి విజయ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చేలా లేదు. అయితే ఏకంగా హీరో సైతం ఈడీ విచారణకు హాజరుకావడంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే డ్రగ్స్ అంశం టాలీవుడ్‌ని కుదేపేస్తుంది. ఇప్పుడు అక్రమ పెట్టుబడుల వ్యవహారం. మరి చూడాలి ఈ కేసు ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news