ఎడిట్ నోట్: బీఆర్ఎస్‌కు ‘సస్పెన్షన్’.!

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు పై చేయి సాధించడానికి ఊహించని ఎత్తులతో ముందుకొస్తున్నాయి. అయితే ఒకరోజు ఒక పార్టీది పై చేయి గా ఉంటే..మరొక రోజు మరొక పార్టీ హవా ఉంటుంది. ఇలా రోజురోజుకూ రాజకీయాలు మారిపోతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఇద్దరు కీలక నేతలపై బి‌ఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.

అయితే బి‌ఆర్‌ఎస్ ఇంతవరకు పెద్ద నేతలని ఇలా సస్పెండ్ చేసింది తక్కువే. ఎక్కువ శాతం నేతలు వారంతట వారే బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. అప్పుడు ఆలె నరేంద్ర దగ్గర నుంచి..మొన్న ఈటల రాజేందర్ వరకు అదే చేశారు. వారికి పొమ్మనలేక పొగబెడుతూ ఉంటారు. నేతలే వారంతట వారే బయటకు వెళ్లిపోతారు. కానీ తాజాగా పొంగులేటి, జూపల్లిలని మాత్రం సస్పెండ్ చేశారు. అలా చేసేలా ఆ ఇద్దరు నేతలు చేసినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న వారికి..బి‌ఆర్‌ఎస్ లో ఈ మధ్య ప్రాధాన్యత లేని విషయం తెలిసిందే.

అలాగే ఎలాంటి పదవులు ఇవ్వలేదు..దీంతో ఆ ఇద్దరు ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు..ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వారికి సీట్లు గ్యారెంటీ లేదు..అయినా సరే అలాగే ఉండిపోయారు. పైగా కే‌సి‌ఆర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంతసేపటికి వారు బయటకు వెళ్లకపోవడంతో..పార్టీ నుంచి తాజాగా సస్పెండ్ చేశారు.

ఈ సస్పెన్షన్ వల్ల ఆ నేతలకు పోయేదేమీ లేదని చెప్పవచ్చు. ఆ ఇద్దరికీ ప్రజా మద్ధతు ఉంది..పైగా వారు పార్టీ సస్పెండ్ చేయడం పట్ల సంతోషంగా ఉన్నారు..ఇప్పుడు ఇంకా పార్టీని దెబ్బతీయడానికి వారు రాజకీయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక వీరి బాటలోనే కొందరు కీలక నేతలు ఉన్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ నుంచి సస్పెండ్ కావాలని చూస్తున్నారట. అయితే బి‌ఆర్‌ఎస్ నేతలని సస్పెండ్ చేయడంవల్ల..నేతలకు ఏమి కాదు గాని..బి‌ఆర్‌ఎస్ పార్టీనే వారు సస్పెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సస్పెన్షన్ వ్యవహారం బి‌ఆర్‌ఎస్ పార్టీకే రివర్స్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news