Suma: సుమ చేతిపై పచ్చబొట్టుగా అతని పేరు..అది ఒక రహస్యమంటున్న జయమ్మ..

-

స్టార్ యాంకర్ సుమ..గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బుల్లితెరతో పాటు సినిమా ఫంక్షన్లలో యాంకరింగ్ చేసి తనదైన ముద్ర వేసుకుంది సుమ. కాగా, చాలా కాలం తర్వాత సుమ..వెండితెరపైన కనబడబోతున్నది. ఇన్నాళ్లు బుల్లితెరపైన సందడి చేసిన సుమ..ఇక వెండితెరను ఏలబోతున్నది.

సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్ పై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ పిక్చర్ కు విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ ఫిల్మ్ ఈ నె ల 6న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది సుమ.

‘జయమ్మ పంచాయితీ’ సినిమా ప్రమోషన్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోలందరిని భాగస్వామ్యం చేస్తోంది సుమ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చేతిపై ఉన్న పచ్చ బొట్టు గురించి, జయమ్మ పంచాయితీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

తన చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నానని, ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్‌ ఏంటనేది తెలియాలంటే ‘జయమ్మ పంచాయితీ’ మూవీ చూడాల్సిందేనని చెప్పింది యాంకరమ్మ సుమ. పిక్చర్ సెకండాఫ్‌లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికీ తెలుస్తుందని సుమ ప్రేక్షకులకు సస్పెన్స్ క్రియేట్ చేసింది. తనకు అవకాశం లభిస్తే రాజీవ్‌ కనకాలతో కూడా సినిమా చేస్తానని అంది. మంచి స్టోరిలు దొరికితే కచ్చితంగా పిక్చర్స్ చేస్తానని చెప్పుకొచ్చింది స్టార్ యాంకర్ సుమ.

Read more RELATED
Recommended to you

Latest news