ఎడిట్ నోట్: మహానాడుతో సైకిల్ దశ మారేనా.!

-

తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి మహానాడు మొదలైంది..రెండు రోజుల పాటు రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మహానాడుని విజయవంతం చేసుకుని, ఎన్నికల సమరంలోకి దూకాలని తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారు. అయితే ఈ మహానాడుతోనే టి‌డి‌పి దశ మారుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టి‌డి‌పికి ఏది కలిసిరాలేదు. అధికార వైసీపీ చేతిలో చావుదెబ్బ తింటూనే వచ్చింది.

ఎక్కడకక్కడ టి‌డి‌పికి ఆదరణ దక్కలేదు. పైగా కోవిడ్ వల్ల ప్రజల్లో తిరగలేని పరిస్తితి..రెండేళ్ల పాటు మహానాడు నిర్వహించుకోలేదు. ఇక గత ఏడాది మహానాడు నిర్వహించారు. అప్పుడు భారీ స్థాయిలో టి‌డి‌పి శ్రేణులు హాజరయ్యారు. ఇక అక్కడ నుంచి టి‌డి‌పికి కాస్త ప్రజల నుంచి స్పందన మొదలైంది. ఓ వైపు చంద్రబాబు ప్రజల్లో తిరగడం, అటు లోకేష్ పాదయాత్రతో ముందుకెళ్లడంతో టి‌డి‌పికి నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ వైసీపీదే హవా అన్నట్లు ఉంది. వైసీపీకి లీడ్ ఉంది.

TDP Mahanadu

వైసీపీ లీడ్ తగ్గించి  టి‌డి‌పి గెలవడానికి ఇంకా కష్టపడాలి. ఇక టి‌డి‌పి దశ మారే విధంగా ఇప్పుడు మహానాడు జరగనుంది. ఈ మహానాడు కార్యక్రమం ద్వారా..ఎన్నికల శంఖారావం పూరించి..పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. అదే సమయంలో మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలని సైతం చంద్రబాబు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో ప్రజలకు మేలు చేసే పథకాలు ఎలాంటివి పెట్టనున్నారు..అభివృద్ధి ఏ విధంగా చేయనున్నారు..ఇలా పలు అంశాలపై ప్రణాళికలు రచించుకుని ప్రజలకు హామీల రూపంలో ఇవ్వనున్నారు. అయితే గతంలో టి‌డి‌పి కొన్ని హామీలని సరిగ్గా అమలు చేయలేదనే అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో హామీలు ఎలా అమలు చేస్తారు..ప్రజల నమ్మకం ఎలా పొందుతారనేది చూడాలి. ఏదేమైనా ఈ మహానాడు టి‌డి‌పి భవిష్యత్‌ని డిసైడ్ చేయనుంది. పార్టీ గెలవాలన్న, ఓడిపోవాలన్న ఈ మహానాడుతోనే తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news