ఎడిట్ నోట్: తెలంగాణ నాడి.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే పార్టీలు అన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఎన్నికల్లో గెలవడానికి అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని ఇటు బి‌ఆర్‌ఎస్, అటు బి‌జే‌పి, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. మరి ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు..అసలు ప్రజలు మళ్ళీ ఎవరికి పట్టం కట్టాలని అనుకుంటున్నారు..తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందంటే? అసలు ఏ మాత్రం తెలియకుండా ఉంది.

ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో అర్ధం కాకుండా ఉంది. రెండుసార్లు అధికారంలోకి వచ్చి..మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్‌ వైపే మళ్ళీ ప్రజలు ఉన్నారా? అంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ లో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అలాగే తెలంగాణ వచ్చిన..అనుకున్న మేర ప్రత్యేక రాష్ట్రం ఎందుకు వచ్చిందో..ఆ లక్ష్యాలు పూర్తి కాలేదు. దీంతో ప్రజలు కే‌సి‌ఆర్‌కు ఏమి అనుకూలంగా లేరు..అలా అని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటే..అది లేదు.

రెండుసార్లు వరుసగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీని కే‌సి‌ఆర్ గట్టిగానే దెబ్బకొట్టారు. అలాగే బి‌జే‌పిని పైకి లేపి..కాంగ్రెస్‌ని రేసులో లేకుండా చేయడానికి ప్రయత్నించారు. ఇక ఎలాగో అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ మరింత దిగజారింది. అలా అని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకుండా లేదు..ఆ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు..కేడర్ ఉంది..కానీ రాష్ట్రంలో ఆధిక్యంలోకి రాలేని పరిస్తితి.

ఇక కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ వెనుకబడటం, కే‌సి‌ఆర్ టార్గెట్ చేయడంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. కానీ బి‌జే‌పికి పూర్తి స్థాయిలో బలం లేదు..గట్టి గా చూసుకుంటే ఓ 50 స్థానాల్లోనే బి‌జే‌పికి బలమైన నాయకులు, అభ్యర్ధులు ఉన్నారు. మరి అలాంటప్పుడు బి‌జేపి గెలవడం కూడా కష్టమే. ఓవరాల్ గా కాస్త బి‌ఆర్‌ఎస్‌కు లీడ్ ఉంది గాని..ఆ పార్టీని గెలిపించేస్తారనే నమ్మకంలేదు. మొత్తానికి తెలంగాణ  నాడి అంతుచిక్కకుండా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news