డీసిపీకి ఈటల రాజేందర్ లెటర్… విచారణకు 10న వస్తాను !

-

ఈ సాయంత్రం ఈటల రాజేందర్ కు వరంగల్ డీసీపీ నుండి నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. టెన్త్ క్లాస్ పరీక్ష పత్రం లీక్ అయిందన్న కేసులో ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేయదలుచుకున్న. అందులో భాగంగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను రేపు ఉదయం వరంగల్ కమిషనర్ ఆఫీస్ కు రమ్మని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ లోపు ఏమి జరిగిందో తెలియదు, ఈటల బాగా ఆలోచించి వరంగల్ డీసీపీకి లేఖ రాయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

ఈయన వరంగల్ డీసీపీకి రాసిన లేఖలో రేపు మీ నోటీసు ప్రకారం విచారణకు హాజరు కావడం లేదని.. ఏప్రిల్ 10న ఉదయం 11 గంటలకు విచారణకు వస్తానని ఈ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖ పై డీసీపీ ఏమి సమాధానం ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news