ఈ బ్యాంక్ కస్టమర్స్ కి అలెర్ట్..! మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా వుందా…? అయితే మీరు దీని కోసం తెలుసుకోవాలి. ఎస్‌బీఐ కస్టమర్లు మే 7వ తేదీ రాత్రి 10.15 గంటల నుంచి మే 8వ తేదీ అర్ధరాత్రి 1.45 గంటల వరకు బ్యాంక్ డిజిటల్ సర్వీసులు పొందలేరు.
ఈ విషయాన్నీ ఎస్బీఐ ట్విట్టర్ లో చెప్పింది. మూడున్నర గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సర్వీసులు ఏవీ పని చేయవని అంది. స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే అందుకు అనుగుణంగా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.
అదే విధంగా దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 8న ఉదయం 2 గంటల నుంచి 5 గంటల వరకు నెట్ బ్యాంకింగ్ సహా మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగుతుంది అని బ్యాంక్ చెప్పింది.
కనుక బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. లేదు అంటే ఇబ్బందులు పడాలి. కనుక ఈ ఖాతాదారులు ఈ ఆంతర్యాన్ని గమనించి పనులు చేసుకుంటే మంచిది. లేదు అంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.