కాసేటి క్రితమే… ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. భారీ భద్రతా బలగాల మధ్య ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిది.
మొదట పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే.. కౌంటింగ్ ప్రారంభం నుంచి యూపీలో బీజేపీ దూసుకుపోతుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. ఎక్సిట్ పోల్స్ ప్రకారమే బీజేపీ లీడింగ్ లోకి వెళ్లింది. ఇప్పటి వరకు యూపీలో బీజేపీ 105 అసెంబ్లీ సీట్లలో లీడింగ్ లో ఉండగా.. ఎస్పీ 80 సీట్లల్లో లీడింగ్ సంపాదించింది. అటు బీఎస్పీ 6 సీట్లల్లో.. కాంగ్రెస్ 2 సీట్లల్లో, ఇతరులు 2 సీట్లల్లో లీడింగ్ లో ఉన్నారు. పోటీ కేవలం బీజేపీ, ఎస్పీల మధ్యే ఉండటంతో..అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.