విద్యుత్ వినియోగదారులకు షాక్.. రాత్రివేళ బాదుడే! విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో ఉదయం విద్యుత్ ఛార్జీల భారం 20 శాతం తగ్గించనుంది. రాత్రి ఛార్జీలు సాధారణం కంటే 10-20 శాతం పెరుగుతాయి. దీంతో రాత్రివేళ బాదుడే ఇక. వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఈ నిబంధన 2024 ఏప్రిల్ 1 నుంచి, వ్యవసాయ, ఇతర వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. స్మార్ట్ మీటర్ల ద్వారా కరెంట్ వినియోగాన్ని లెక్కించనున్నారు.
విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు, రద్దీ లేని సమయాల్లో కరెంట్ వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని దేశంలో అమలులోకి తీసుకొస్తోంది. దీనివల్ల పీక్ లోడ్ తగ్గటంతో పాడు గ్రిడ్ స్థిరత్వం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 2024 నుంచి వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వర్తించనున్నాయి. అలాగే ఏడాది తర్వాత వ్యవసాయ రంగంలోని వినియోగదారులకు మినహా.. ఇతర వినియోదారులందరికీ అమలవుతాయని రాయటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.