అయిపోయింది.. ట్విటర్ ఖేల్ ఖతం అయింది. ఇక నుంచి మనకు ట్విటర్ కనిపించదు. ఎందుకంటే.. ట్విటర్‌ను మరో కంపెనీలో విలీనం చేశారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో ట్విటర్‌ను కలిపేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ట్విటర్ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని, ఒక కేసు నేపథ్యంలో కోర్టుకిచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో మంగళవారం ‘ఎక్స్’ అంటూ ఒకే అక్షరాన్ని మస్క్ ట్వీట్ చేశారు.
ట్విటర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్ యాప్‌నకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు మస్క్. ‘’ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక. దీని రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విటర్ ఉపయోగపడుతుంది. ట్విటర్‌ను కొనుగోలు చేస్తే.. ఎక్స్ సంస్థ 3-5 ఏళ్లు ముందుకు వెళ్తుంది’’ అని గతేడాది అక్టోబర్‌లో ట్వీట్ చేశారాయన. చైనాలో ఉండే ‘వీచాట్’ తరహాలో మెసేజింగ్, కాలింగ్, చెల్లింపులు, ఇతరత్రా కార్యకలాపాలన్నీ ఒకే యాప్‌లో చేసుకునేలా చూడాలన్నది మస్క్ లక్ష్యం.
X
— Elon Musk (@elonmusk) April 11, 2023