టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటేశారు. 44 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌ను తన చేతిలోకి తీసుకున్నారు మస్క్. అయితే గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు. వీరితోపాటు లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌పై వేటు వేసినట్లు సమాచారం. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్ ఇప్పటికే స్పందించారు.
75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు. ట్విట్టర్ కొనుగోలు డీల్‌కు గతంలో ఒకసారి నిలిచిపోయింది. సంస్థ చెప్పిన దానికన్నా.. సామాజిక మాధ్యమంలో బాట్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిని సీరియస్ గా పరిగణించిన మస్క్.. పూర్తి డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ట్విట్టర్ నిరాకరించింది. డీల్‌పై చర్చల సమయంలోనే దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చామని వెల్లడించింది. దీంతో ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను ఎలన్ మస్క్ నిలిపివేసిన విషయం తెలిసిందే.