అదిరే LIC పాలసీ.. ఏడాదికి రూ.50,000.. ఎలా అంటే…?

-

LIC కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. వీటి వలన మనకి ఎన్నో లాభాలు పొందేందుకు అవుతుంది. చాలా మంది డబ్బులని నచ్చిన స్కీమ్స్ లో పెడుతూ వుంటారు. వీటి వలన చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే LIC అందించే వాటిలో సరళ్ పెన్షన్ ప్లాన్ కూడా ఒకటి. దీని వలన మంచిగా లాభాలు వస్తాయి. ఏడాదికి రూ.50,000 పైనే పెన్షన్ ఇందులో ఇన్వెస్ట్ చేసి పొందొచ్చు.

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ వస్తుంది. ఇక మరి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే… సింగిల్ ప్రీమియం పాలసీ ఇది. ఈ పాలసీని 40 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు తీసుకునేందుకు అర్హులు. పాలసీ తీసుకున్న ఏడాది నుంచే యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. దీని ద్వారా నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పొందొచ్చు.

ప్రీమియంని బట్టి డబ్బులు వస్తాయి. దీనిలో డబ్బులు పెట్టాలనుకునే వారు ఆఫ్ లైన్ ద్వారా కానీ ఆన్ లైన్ ద్వారా కానీ పెట్టచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు యాన్యుటీ వస్తుంది. ఒకవేళ మరణిస్తే నామినీకి మొత్తం డబ్బులు వస్తాయి. 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి పది లక్షలు ప్రీమియం చెల్లించి ఏడాదికోసారి యాన్యుటీ తీసుకుంటే ఏడాదికి రూ.58,950 యాన్యుటీ వస్తుంది. అదే జాయింట్ అకౌంట్ తీసుకుంటే ఏడాదికి రూ.58,250 యాన్యుటీ లభిస్తుంది. మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి రూ.58,250 యాన్యుటీ లభిస్తుంది. ఇద్దరు మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news