‘ఏమి సేతురా లింగ’ రివ్యూ..మూవీ అదిరిపోయిందిగా !

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అనేక రకాలైన సినిమాలు వస్తున్నాయి. క్రైమ్‌, రొమాంటిక్‌, యాక్షన్‌, హార్రర్‌, సస్పెన్స్‌ స్టోరీలు ఇలా.. ఎన్నో రకాల కథలు వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్‌, రొమాంటిక్‌, యాక్షన్‌, హార్రర్‌, సస్పెన్స్‌ ఇలా ఎన్ని రకాలుగా వచ్చినా… కథ లో బలం ఉన్న సినిమాలు ఆడుతుంటే.. మరికొన్ని మాత్రం అట్టర్‌ ఫ్లాఫ్‌ అవుతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు చాలా డిఫెరెంట్‌ కథతో వస్తున్నాయి.

 

అలా వచ్చిన సినిమానే “ఏమి సేతురా లింగ” మూవీ. ‘ఏమి సేతురా లింగ’ సినిమాను దర్శకుడు కె.సందీప్  తెరకెక్కించారు. వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్,ఆనంద చక్రపాణి , మేకా రామకృష్ణ, పవన్ రమేష్ తదితరులు నటించి ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే ఈ మూవీ ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది. మే 19 అంటే ఇవాళ 12 గంటల నుండి ఈ మూవీ నేరుగా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ మరియు వివరణ

‘ఏమి సేతురా లింగ’ సినిమా కథ విషయానికి వస్తే… భాను(వినోద్ వర్మ) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. జీతం బాగానే వస్తున్నా.. అతనిలో ఆనందం అనేది ఉండదు. ‘డబ్బు.. అది తెచ్చే సౌకర్యాలే తనని హ్యాపీగా ఉంచుతున్నాయి’ అని భావించి ఇష్టం లేకపోయినా ఆ జాబ్ చేస్తుంటాడు. కానీ బాస్ టార్చర్, పని ఒత్తిడి వల్ల.. చాలా ప్రెజర్ మీద పడినట్టు బాధపడుతుంటాడు. దీంతో అతని ఫ్రెండ్ నీకు రిలేషన్ అవసరం అనే సూచన ఇస్తాడు. కానీ ఇతనితో ఏ అమ్మాయి కూడా రిలేషన్షిప్ కోసం ఇష్టపడడు.

 

ఓ అమ్మాయి ఇష్టపడినట్లు ప్రేమ వరకు తీసుకొచ్చి ఇతని వద్ద రింగ్ కొట్టేసి వెళ్ళిపోతుంది. అనుకోకుండా ఇతని లైఫ్ లోకి స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) అనే మరో ఎంటర్ అవుతుంది. ఈమె చాలా ప్రాక్టికల్ అమ్మాయి. ఈమె ఎంటర్ అయ్యాక భాను జీవితంలో ఎలాంటి మార్పులు? పరిస్థితులు ఏర్పడ్డాయి? అన్నది మిగిలిన కథ. భాను పాత్రలో వినోద్ వర్మ చాలా సహజంగా నటించాడు. అతని పాత్ర ఇష్టం లేకుండా సాఫ్ట్ వేర్ జాబ్ లు చేసుకుంటున్న చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జ్ఞానేశ్వరి కాండ్రేగుల .. స్వేచ్ఛ అనే అమ్మాయి పాత్రలో చాలా బోల్డ్ గా నటించింది. ఇలాంటి పాత్రలో నటించడానికి చాలా గట్స్ ఉండాలి. కానీ ఈమె చాలా ఈజ్ తో చేస్తుంది. కేశవ్ దీపక్ … హీరోకి మేనేజర్ పాత్రలో బాగా నటించాడు. తన క్యాస్ట్ వాళ్లకు జాబ్ ఇవ్వాలి,వాళ్ళను టాప్ ప్లేస్ కు తీసుకురావాలి అనుకునే అతని పాత్ర కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు కె.సందీప్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న పాయింట్ ను ఎంచుకున్నాడు. కథనం కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. బలవంతంగా సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏ సన్నివేశంలోనూ కలగదు. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ప్రతి పాత్ర అలా గుర్తుండిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా.. క్వాలిటీ ఔట్పుట్ ను అందించాలి అనే అతని తపన ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. రన్ టైం కూడా రెండు గంటల లోపే ఉండేలా చూసుకున్నాడు. తప్పకుండా ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది.డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. జెన్ మార్టిన్ అందించిన పాటలు నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ సినిమాలో ఆహాలో చూసేయండి.

 

పాజిటివ్‌ పాయింట్స్‌

దర్శకత్వం
కథ
సినిమాటోగ్రఫీ
నటీనటులు

రేటింగ్ : 3.25/5

Read more RELATED
Recommended to you

Latest news