పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించం..కొడాలికి GVL వార్నింగ్

-

కొడాలి నానిపై జీవీఎల్ కామెంట్స్‌ చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి…పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని వార్నింగ్‌ ఇచ్చారు జీవీఎల్. వైసీపీ అవినీతిపై ఛార్జిషీటు, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా చర్చ జరిగిందని…పొత్తుల అంశం మేం చర్చించలేదని పేర్కొన్నారు. మా మిత్ర పక్షమైన జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది…ఎన్నికల సమయంలో ఎలా‌ వెళ్లాలనేది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుంది…జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో మునిగి తేలుతోంది…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీపై బీజేపీ పోరాడుతోందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుంది…మోడీ తొమ్మిదేళ్ల ప్రగతి పాలనను ప్రజలకు వివరిస్తూ నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకుల పై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం.. వైసీపా వైఫల్యాలను ఎత్తి‌చూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు జీవీఎల్‌.

Read more RELATED
Recommended to you

Latest news