టిక్ టాక్ నిషేధంపై ఉద్యోగులు న్యాయ పోరాటం

-

అమెరికాలో ప్రముఖ వీడియో యాప్‌ టిక్​టాక్​ నిషేధం ఉత్తర్వులపై సంస్థతోపాటు ఉద్యోగులూ కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్​ రూపొందిస్తున్న న్యాయవాది మైక్​ గాడ్విన్​ ఈ విషయాలను వెల్లడించారు. టిక్టాక్​ కంపెనీ, ఉద్యోగులు వేర్వేరుగా పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు గాడ్విన్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదించనున్నట్లు తెలిపారు.

Trump
Trump

అయితే అమెరికాలోని 1,500 మంది ఉద్యోగులకు టిక్​టాక్​ జీతాలు చెల్లించటం చట్ట విరుద్ధమవుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. అందుకే టిక్​టాక్​ ఉద్యోగులు న్యాయవాదిని ఆశ్రయించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం టిక్​టాక్​, దాని మాతృసంస్థ బైట్​డాన్స్​ చేసే ప్రతి లావాదేవీకి నిషేధం వర్తిస్తుంది.ప్రస్తుతం టిక్​టాక్​ ఉద్యోగుల జీవనోపాధి, జీతాలు ప్రమాదంలో పడ్డాయని గాడ్విన్ తెలిపారు. కార్మికుల హక్కులపైనే ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తారని, ట్రంప్ పేర్కొన్న జాతీయ భద్రతపై కాదని స్పష్టం చేశారు.

ఉద్యోగుల పిటిషన్​తో తమకు సంబంధం లేదని టిక్​టాక్ తెలిపింది. కానీ, సంఘటితంగా పోరాడే వారి హక్కులను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధం బెదిరింపుల నేపథ్యంలో టిక్​టాక్​ను బలవంతంగా దక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news