ముదిరిపోయిన టీడీపీ నేతలు… బాబుని మించిపోయారుగా!

-

రాజకీయాలందు చంద్రబాబు రాజకీయాలు వేరయా అంటారు విశ్లేషకులు. ఏ విషయంలో అయినా తనదైన రాజకీయాలకు అనుగుణంగా మలచుకోగల సామర్ధ్యం బాబు సొంతం అనేది వారి మాట. అయితే అది గతం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. జగన్ పాలన ప్రారంభమైనప్పటినుంచీ బాబు రాజకీయ పాచికాలు పారడం లేదని వారి మాట. దీంతో… ప్రస్తుతం బాబుని మించిన రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ నేతలు!

ఇంతకాలం బాబు రాజకీయాలు చేస్తుంటే.. వాటిని ఫాలోఅయ్యేవారు టీడీపీ నేతలు. అయితే… ప్రస్తుతం చంద్రబాబు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఎవరికి వారే యమునాతీరే అన్న పంథాను ఫాలోఅవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అందులో భాగంగా ప్రస్తుతం టీడీపీ నేతలకు జగన్ కొడుతున్న రాజకీయ దెబ్బలు ఒకెత్తు అయితే… అమరావతి విషయంలో జరుగుతున్న పరిస్థితులు మరొకెత్తు!

ఈ విషయంలో ఇరకతరకలు పడిపోతున్నారు ముఖ్యంగా… విశాఖ టీడీపీ నేతలు. దీంతో… వారు చంద్రబాబు తో జూం లోకి వచ్చినప్పుడు మాత్రం… అమరావతికే జై అంటున్నారు. జూం యాప్ క్లోజ్ చేసిన అనంతరం… జై విశాఖ అని అంటున్నారట! ఇందులో భాగంగా… రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న వాసుపల్లి గణేష్ కూడా ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని అంటున్నారు. బాబుని నొప్పించక విశాఖ వాసులనూ నొప్పింపక తప్పించక అన్నపంథాల్లో ఉన్నారనే కామెంట్లు పడుతున్నాయి!

మరి ఈరోజో రేపో కోర్టులలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి… ఏపీ సర్కార్ విశాఖకు బయలుదేరే పరిస్థితుల్లో ఈ విశాఖ ఎమ్మెల్యేలు… ఆ రాకను స్వాగతిస్తారా లేక ఎదురెళ్లి ధర్నాలు గట్రా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో.. చంద్రబాబు నిర్వహిస్తోన్న సంతకాల సేకరణ విషయంలో కూడా… రెండు సంతకాలు పెడతారా… లేక ఒక్క సంతకమే పెడతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది!!

Read more RELATED
Recommended to you

Latest news