మాములుగా ప్రభుత్వ నిబంధలు ప్రకారం ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి అధికారుల జీతభత్యాలను సవరించి అందుకు సంబంధించిన జీవో చేసి, దానిని విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అలాగే చేస్తూ రావడం పరిపాటి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2007 నుండి ఇప్పటి వరకు ఎటువంటి జీవో విడుదల చేయలేదని పిటీషన్ హై కోర్ట్ లో వేశారట.
దీనిని పరిగణలోకి తీసుకుని విచారించిన హై కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని మరో నాలుగు వారాల్లోగా ఈ విషయంపై తగిన వివరణ ఇస్తూ కోర్ట్ లో కౌంటర్ వేయాలని ఆదేశించింది. కాగా ఈ పిటీషన్ పై మళ్ళీ విచారణ జూన్ 19 న ఉంటుందని తెలిపింది. మరి హై కోర్ట్ ఇచ్చిన ఈ షాక్ కు కేసీఆర్ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.