సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన రాకేష్ స్వగ్రామం దబ్బీర్ పేటలో సంతాపసభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, కలెక్టర్ గోపి హాజరయ్యారు. అగ్నిపథ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సంతాప సభ ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల ఎక్సిగ్రేషియా చెక్కును రాకేష్ తండ్రీ కుమారస్వామి కి అందజేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… రాకేష్ స్వగ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని.. గ్రామాభివృద్ధికి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. రాకేష్ ఆత్మకు శాంతి చేకూరాలంటే కేంద్రం వెంటనే అగ్నిపథ్ చట్టాన్ని వెనక్కితీసుకోవాలి…పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సైన్యాన్ని అవమానపరిచేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారని.. చేతులెత్తి మొక్కుకున్న యువతను ఆగం చేయకండీ, అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరారు.