తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి కేసీఆర్ బేడీలు వేశారని, ఎన్నికల హామీల అమలు విఫలమయ్యాయని డి.కె.అరుణ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో మోడీ బహిరంగ సభ చరిత్రలోనే గొప్ప సభ గా నిలిచిపోతుంది అన్నారు. మోడీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు డి.కె.అరుణ. అగ్నిపధ్ విషయంలో ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అన్నారు.దేశాన్ని మోదీ సాబ్ కా సాత్, సాబ్ కా వికాస్ తో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.