నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాలలో డైట్ చార్జీల కోటా పెంచాలని ప్రభుత్వాన్ని ఈటెల కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈటెల రాజేందర్ సూచనలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈటెలది న్యాయమైన కోరిక గనుక జీవోను జారీ చేయాలని సూచించారు.
ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దన్నారు. కావాలంటే ఈటెలను కూడా పిలిచి సలహా తీసుకోవాలని సూచించారు. ఇక అసెంబ్లీ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తనని డ్యామేజ్ చేయాలనుకున్నారని, చేసేసారని అన్నారు. ఒక అబద్ధాన్ని అటు చెప్పగల, ఇటు చెప్పగల నాయకుడు కేసీఆర్ అని.. కెసిఆర్ చేసిన డ్యామేజ్ కడుక్కోవాలంటే ఎన్ని నెలలు పడుతుందోనని వ్యాఖ్యానించారు ఈటెల రాజేందర్. అలాగే సిఎం కేసీఆర్ ను పొగిడారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడు.. దేశానికి నాయకత్వం వహిస్తే సంతోషిస్తానని ఈటల హాట్ కామెంట్స్ చేశారు.