హరీష్ రావు ఇంట్లో ఓట్లు కూడా నాకే పడతాయి : ఈటల కౌంటర్

-

కరీంనగర్ జిల్లా : మంత్రి హరీష్ రావు కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా తనకే ఓటు వేస్తుందని ఎద్దేవా చేశారు ఈటల. ఈటల గెలిస్తే అనేక మంది ఈటల రాజేందర్ లు ఎక్కడ పుట్టుకస్తారోనని కేసీఆర్ కు భయం పట్టుకుందని చురకలు అంటించారు.

హుజూరాబాద్ లో బిజెపి నాయకుల పైనే కాదు టీఆరెఎస్ ఇంఛార్జి ల పై కూడా నిఘా ఉందని.. హుజురాబాద్ లోని కొందరు ఇంఛార్జీలు కూడా నేనే గెలువలనుకుంటున్నారని బాంబ్ పేల్చారు ఈటల. హుజూరాబాద్ నియోజకవర్గం లో మూడు రోజుల నుంచి దసరా పండుగ నడుస్తుందని.. తెలంగాణ లో రాజకీయ విలువలు లేవు కేవలం కేసీఆర్ అరాచకం మాత్రమే ఉందని మండిపడ్డారు. 2014 లో కేసీఆర్, హరీష్ రావు ఆస్తులు ఏంటో అందరికీ తెలుసని.. ఎమ్మెల్యే లను కూడా నమ్మకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్ కి ఎక్కడిది..? అని నిలదీశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news