వావ్.. క్యారెట్ సీడ్ ఆయిల్ తో ఈ సమస్యలు మాయం..!

-

క్యారెట్ సీడ్ ఆయిల్ వల్ల ఎంతో మేలు మనకి కలుగుతుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ నుండి ఎన్నో సమస్యలు దీనిని ఉపయోగిస్తే దూరం అయిపోతాయి. రెగ్యులర్ గా ఈ ఆయిల్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గిపోతాయి.

క్యారెట్ సీడ్ ఆయిల్

అదే విధంగా ముఖం మీద గ్లో వస్తుంది. క్యారెట్ సీడ్ ఆయిల్ లో విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. యాక్నీ వంటి చర్మ సమస్యలని కూడా ఇది ఈజీగా తొలగిస్తుంది.

క్యారెట్ సీడ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు:

క్యారెట్ సీడ్ ఆయిల్ ని డైరెక్ట్ గా అప్లై చేసుకో కూడదు. దీనిలో కాస్త కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం నూనె ని కానీ మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు.

దీని వలన ముడతలు తగ్గుతాయి. కొద్దిగా క్యారెట్ సీడ్ ఆయిల్ ని ముఖం మీద అప్లై చేసుకుంటే ముఖం మీద ముడతలు తొలగిపోతాయి.

అలానే జుట్టుకి ఎంతో ప్రయోజనకరం. కొద్ది చుక్కల క్యారెట్ స్వీట్ సీడ్ ఆయిల్ ని కండిషనర్ లో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా, పొడిబారిపోకుండా ఉంటుంది. ఇలా ఈ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news