టిఆర్ఎస్ లో ఉండాలని బెదిరిస్తున్నారు : ఈటల

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో సారి టిఆర్ఎస్ ఫైర్ అయ్యారు. నియోజక వర్గం లో తనతో పాటు ఉండే వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని…నియోజక వర్గంలో బిజినెస్ నడువాలంటే టీఆర్ఎస్ పార్టీ లో ఉండాలని బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. డబ్బులు,కుల సంఘాల భవననాలు పెన్షన్ లు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.

తన రాజీనామా వల్లే ఇవ్వన్నీ నియోజక వర్గానికి వస్తున్నాయని పేర్కొన్నారు. గతం లో ముఖ్యమంత్రి నన్ను కుడి భుజమని…తమ్ముడు అని రైతు బందు పథకాన్ని ఇదే ప్రదేశం లో ఆవిష్కరించిన మాట వాస్తవమన్నారు.2018 ఎన్నికల్లో నా మీద ఒక వ్యక్తి తో వెయ్యి కోట్లు సంపాదించాడని నా మీద పోస్టర్లు,కరపత్రాలు కొట్టిచారని ఫైర్ అయ్యారు. నేను పదవుల్లో ఉన్ననాడు ఎవరి మీద కేసులు పెట్టియలేదని… పేర్కొన్నారు. ఓడగొట్టమని తన ప్రత్యర్థి కి డబ్బులు పంపినా నేను ఆ బాధను దిగమింగుకున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎన్నికలో చేసిన వాగ్దానం 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ లు, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించానని ..గత పద్దెనిమిది ఏళ్ళుగా నేను ఉద్యమం లో పాల్గొనలేదా,ఇప్పుడు నియోజక వర్గం లో తిరుగుతున్న మంత్రుల మీద ఉన్నాయా ? కేసులు నా మీద ఉన్నాయా ? అని మండిపడ్డారు. ఉద్యమం లో పాల్గొని వెన్నంటే ఉన్న వాళ్ళను కెసిఆర్ దూరం పెట్టాడని… తిట్టినోల్లను దగ్గర పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ, ఎప్పుడు, ఎం జరిగిందో తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news