నడ్డా మాటలు ఈటెలకు నచ్చినట్టేనా…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఏంటీ అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా కూడా చర్చ అంతా. ఈ నేపధ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ కాగా పార్టీలోకి వస్తే ఏ ఇబ్బంది రాదని సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటి కాదని మరోసారి ఈటెలకు స్పష్టం చేసారు.

టీఆర్ఎస్ పై పోరాటాలకు మా వ్యూహాలకు మాకున్నాయని ఈటలతో నడ్డా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టి.. ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం అని అన్నారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్ అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ పొలిటికల్ జిమ్మికులను ప్రజలు నమ్మరు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నడ్డా మాటలపై సంతృప్తి చెందిన ఈటెల బిజెపిలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారు.