కేసీఆర్ కు షాక్ ఇస్తూ షర్మిల కీలక అడుగు

తెలంగాణా సిఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ దూసుకుపోతున్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఈ మధ్య కాలంలో ఆమె చేసే ఆరోపణలు తెరాస ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆమె మరో కీలక అడుగు వేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు కూడా ఆమె అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. రేపు సిఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పర్యటనకు వెళ్తారు. గన్ పార్క్ కి వెళ్లి నిరుద్యోగుల కుటుంబాలకు సంతాపం తెలియజేయనున్నారు. దీనితో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తిని రేపుతుంది.