ఇండియా-పాక్‌ మ్యాచ్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం!

టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా అక్టోబర్‌ 24 వ తేదీన పాక్‌ మరియు ఇండియాల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రోజు సోషల్ మీడియా కి దూరంగా ఉంటానని తన సోషల్‌ మీడియా వేదిక గా స్పష్టం చేశారు సానియా మీర్జా.

ఇరు జట్ల మధ్య మ్యాచ్ సమయంలో విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకే ఆ రోజు సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు సానియా మీర్జా.

మ్యాచ్ సమయంలో ఇరు దేశాల అభిమానులు ఉద్వేగంతో ఉంటారని, అందుకే తాను ఆ రోజు సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని చెప్పారు సానియా. గతంలో ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అటు మన దేశంలోని చాలా మంది రాజకీయ నాయకులు ఈ మ్యాచ్‌ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.