3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా.. కెసిఆర్ పడుకున్నాడు : ఈటల రాజేందర్

-

నేను రాజును నాకే.. అన్నీ తెలుసు అన్నట్లు గా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని.. నేను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారు… బేశాజాలు ఎందుకు? అని కెసిఆర్ పై మండిపడ్డారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.

etala
etala

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. Go 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని.. స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారన్నారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి.. ఇప్పుడు పరుగులు పెడుతున్నారని కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని.. వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. చనిపోయిన వారి ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి విషాద వాతావరణం ఉందన్నారు. చిక్కుముడులు, అపోహలు,అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరిపాలి. అప్పటి అరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. వీరి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news