నిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణలోనే ఉన్నత హాస్పిటల్ గా తీర్చిదద్దడంలోనూ ముందు ఉన్నాం అని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. డిల్లీ లో మాత్రమే వున్న మలిక్యూలార్ లాబ్ ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్ బాధపడే వాళ్ళ కోసం ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. దేశం లో ప్రస్తుతం ఉన్నత లాబ్ ఇక్కడ ఏర్పాటు చేశాం అని ఆయన వివరించారు.
రక్త క్యాన్సర్ తో బాధపడే వాళ్లకు ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద ఫ్రీ గా సర్వీస్ అందించవచ్చని చెప్పారు. తెలంగాణలో వున్న అన్ని హాస్పిటల్ లో ఉన్నత వసతులు నిమ్స్ కు ఉన్నాయని అన్నారు. కొవిడ్ తక్కువ అవుతున్న నేపధ్యంలో అన్ని వైద్య సేవలను అంబాటులోకి తీసుకొని వస్తున్నాం అని చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పిన అన్ని గైడ్ లైన్స్ ఫాల్లో అయినం అన్నారు ఈటెల. గతంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉండేవో కరోనా తో కూడా అలానే ఉందని అన్నారు. తెలంగాణలో ప్రతి గడపలో టెస్టుల చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. నిమ్స్ లో ఓ పి పెంచేందుకు కృషి చేస్తున్నాం కొత్త ఓ పి బ్లాక్ ప్రారంభిస్తామని అన్నారు.