అబద్దమే చెప్పు.. ఈ కాంగ్రెస్ తీరు అబద్ధాలు పదే పదే చెప్పు అన్నట్టుగా ఉంది అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. అబద్ధమే చెప్పు.. నిజం చెప్పకు అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది అని మాట్లాడారు. ఇదే సందర్భంలో గందరగోళం చోటు చేసుకుంది. హరీశ్ రావు మాట్లాడుతుండగా దొంగ అన్నారు. వెంటనే హరీశ్ రావు యూస్ లెస్ ఫెల్లో అనగానే అందరూ ఒక్కసారిగా అరిచారు. నన్ను దొంగ అంటే యూస్ లెస్ ఫెల్లో అంటానని హరీశ్ రావు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్దాలు చెప్పారు. ఎన్నికల సమయంలో ఏ రకంగా చెప్పారో సభలో కూడా అదే చెప్పారు. జీవో నెం.26 రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి విలేజ్ శేరిలింగంపల్లి మండలం రూ.75కోట్లకు ఎకరం లెక్కన అమ్మింది. ఈ భూమి కుదబెట్టి TGIIC వాళ్లు తిరుగుతున్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.