“నన్ను జైలులో పెట్టినా ఎన్నికల్లో పోటీ చేస్తా”.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ తీరును విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా మీడియాతో మాట్లాడారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. వెంకటాచలం మాజీ జడ్పీటీసీ వెంకట శేషయ్య యాదవ్ పై ఓ మహిళా నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీ తనకు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా రిమాండ్ రిపోర్టులో వివరాలు సరిగ్గా లేవని న్యాయమూర్తి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో మెటీరియల్ ఎవిడెన్స్ చెబుతూ మల్లీ ఆ రిమాండ్ రిపోర్టును మార్చి తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసుపై న్యాయ వ్యవస్థను పోలీసులు తప్పు దోవ పట్టించారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి. ఎస్పీ విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని.. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఘటనా స్థలానికి రాకుండానే నివేదిక ఇచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news