జూ. ఎన్టీఆర్ కూడా టీడీపీని కాపాడలేడు : కొడాలి నాని..!

-

తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయిన ఈ పార్టీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితికి చేరుకుంది. అయితే పార్టీకి పూర్వ వైభవం రావాలంటే కొత్త రక్తం, కొత్త నాయకత్వం పార్టీకి అవసరమని పార్టీలోని చాలామంది నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి తారక రామారావు (జూ. ఎన్టీఆర్) పేరు అనేక సార్లు తెరపైకి వచ్చింది. అయితే పార్టీ అధినేత మాత్రం దీనిపై స్పందించలేదు.

కాగా, పార్టీలోని కొందరు నేతలు నేతలు, మాజీ మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం జూ. ఎన్టీఆర్ ఇప్పటికప్పుడు రావాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేసారు. అయితే తాజాగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన మంత్రి కొడాలి నాని.. జూ. ఎన్టీఆర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పూర్తిగా కనుమరుగు అయిపోయిందని ఎద్దేవా చేసాడు. ఏపీలో టీడీపీని తినేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన కామెంట్ చేసాడు. అలాగే జూ. ఎన్టీఆర్ వచ్చినా కూడా ప్రస్తుతం టీడీపీని కాపాడలేని పరిస్థితికి వచ్చేసిందని తెలిపాడు నాని.

Read more RELATED
Recommended to you

Latest news