స్టేట్ బ్యాంక్: EMI విషయంలో కీలక నిర్ణయం… వివరాలు ఇవే…!

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా ఉందా..? అయితే మీరు EMI లో వచ్చిన మార్పులని గమనించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోళ్లకు సంబంధించి తమ కస్టమర్లకు కొత్త సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

SBI క్రెడిట్ కార్డు యూజర్లు పెద్ద మొత్తంలో చేసే కొనుగోళ్లను తక్కువ వడ్డీతో లభించే EMIలుగా మార్చుకునే అవకాశం ఇప్పుడు కల్పించనుంది. ప్రాసెసింగ్ ఫీజును సైతం దీనిలో రద్దు చేస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఖాతాదారులు తమ కొనుగోళ్లను అతి తక్కువ వడ్డీ రేటు తో ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

ఈ సేవలను బ్యాంక్ ‘ఫ్లెక్సీపే’గా ఇవ్వడం జరుగుతోంది. అసలు ఫ్లెక్సీ పే అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు రూ.1000 కొనుగోలుకు.. ఆరు నెలల ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కింద రూ.177.5 మాత్రమే చెల్లించాలి. 12 నెలల పేమెంట్ ఆప్షన్‌లో రూ.93.5, 24 నెలలకు రూ.51.9 మాత్రమే EMI గా చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తం లో చేసే కొనుగోళ్ల ఈఎంఐలను తక్కువ నెలలకు పరిమితం చేసేందుకు ఫ్లెక్సీపే ఆప్షన్‌ ఉపయోగపడనుంది. తక్కువ నెలల EMIను కస్టమర్లు ఎంచుకునేందుకు ఈ ఆప్షన్ వీలు కల్పిస్తోంది. అయితే ట్రాన్సాక్షన్ జరిగిన 30 రోజుల్లోగా పెద్ద కొనుగోళ్లను ఫ్లెక్సీపే ఈఎంఐగా మార్చుకోవచ్చు.

ఈ ఆఫర్ 2021, మే 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీ కొనుగోళ్లను సులభమైన వాయిదాలుగా మార్చుకునే అవకాశాన్ని ఇస్తోంది. దీన్ని ఎంచుకున్న కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లతో పాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం SBI క్రెడిట్ కార్డులను వాడుతున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు.

ఇది ఇలా ఉంటే కస్టమర్లు కనీసం రూ.500 కంటే ఎక్కువ మొత్తం లో చేసిన లావాదేవీని ఫ్లెక్సిపేగా మార్చుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే..? కనీస బుకింగ్ మొత్తం రూ.2500గా ఉంటుంది. కస్టమర్లు 6, 9, 12, 24 నెలల కాలానికి రీపేమెంట్ చేయవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news