టీడీపీ వరుస అరెస్టులకూ టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకూ ఏమాత్రం సంబంధం లేదనేది అందరూ చెప్పే మాటే!! అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినప్పుడు దాన్ని బీసీలపై కక్షసాధింపు చర్యలుగా చూపించిన టీడీపీ నేతలు.. అదే బీసీ నేత కొల్లు రవీంద్ర ను అరెస్టు చేసినప్పుడు మాత్రం ఒక విషయంలో తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హత్యానేరారోపణలో భాగంగా అరెస్టు చేసినా కూడా… బీసీలను అణగదొక్కుతున్నారని బాబు హడావిడిచేసి.. కొల్లు కుటుంబానికి ఫోన్ చేసి అనంతరం సైలంట్ అయిపోయారు!
ఈ విమర్శలు పెరిగిపోతున్నాయానమో ఏమో కానీ… విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ ని కొల్లు కుటుంబాన్ని పరామర్శించడానికని బాబు పంపారంట. ఎక్కడో విశాఖలో ఉన్న వ్యక్తిని పంపడం ఏమిటి… చినబాబు ఉన్నారుగా? ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతుంది!!
అవినీతికేసులో అచ్చెన్న అరెస్టయితే శ్రీకాకుళం వరకూ వెళ్లారు చినబాబు… ఫ్యామిలి ధైర్యం చెప్పీ వచ్చారు! జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయితే.. తాడిపత్రి వరకూ వెళ్లి ఫ్యామిలీని పరామర్శించి వచ్చారు! మరి కొల్లు రవీంద్ర అరెస్టు అయితే.. బందరు వరకూ వెళ్లి వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు!! అంటే… బాబు దృష్టిలో టీడీపీ బీసీలు – వైకాప బీసీలు వేరని తెలుసనీ… టీడీపీలోనే మళ్లీ… “మామూలు బీసీలు, బినామీ బీసీలు అని వేరే వర్గాలు ఉన్నాయన్న మాట” అని మరికొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
అచ్చెన్నాయుడిని పరామర్శించడంలో చూపించిన ఉత్సాహం కొల్లు రవీంద్ర విషయంలో బాబు & కో ఎందుకు చూపించడం లేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దీనికి వైపాకా నేతలు చెబుతున్న మాట… “మేము చెప్పేది కూడా అదే కదా… అచ్చెన్న బాబు బినామీ… అంతకు మించి ప్రత్యేకంగా బాబుకు బీసీలపై ప్రేమేమీ లేదు.. కొల్లు రవీంద్రే ఉదాహరణ” అని!!