నిన్న పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి నెగ్గిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రము ఈ బిల్లును వ్యతిరేకించి దేశం దృష్టిలో పడ్డారు. కాగా తాజాగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పై మాజీ మిస్ యూనివర్స్ తన స్పందనను తెలియచేసింది. మాజీ యూనివర్స్ హర్నాజ్ సందు మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ లో నిన్న ఆమోదం దక్కడం చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని తెలియచేశారు. దేశవ్యాప్తంగా మహిళలు తమ స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలని.. అలాంటి అన్ని ప్రాంతాలలో మహిళలు ఉండాలని కోరుకుంటున్న అంటూ హర్నాజ్ పేర్కొంది.
మహిళలు అభివృద్ధి కావడానికి మరియు దేశం దృష్టిలో తాము రాజకీయాల్లోనూ రాణించగలం అని నిరూపించడానికి మంచి అవకాశం అన్నారు. ఇంకా నన్ను కొత్తగా ప్రారంభించిన పార్లమెంట్ కు ఆహ్వానించినందుకు కృతఙఞతలు అంటూ హర్నాజ్ సందు తెలిపింది.