తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ లు

-

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లు విజయవాడ నుంచి చెన్నై, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య ప్రయాణించనున్నాయి. ఈ నెల 24న ఈ వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అదే రోజున మరో 7 వందేభారత్ రైళ్లను కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్ తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి మాంచి డిమాండ్ ఏర్పడడంతో రద్దీగా ఉండే ఇతర మార్గాలపైనా రైల్వే శాఖ దృష్టి పెట్టింది.

Integral Coach Factory: Exclusive: New orange Vande Bharat Express hits the  tracks; watch video & see pics of new Indian Railways train - Times of India

కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను ఆదివారం(సెప్టెంబర్‌ 24) మధ్యాహ్నం 12.30 కు ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ఈ రైలును ప్రారంభించనున్నారు. సోమవారం(సెప్టెంబర్‌ 25) నుంచి అధికారికంగా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. అంతే కాకుండా ఈ నెల 24న ప్రధాని మోదీ కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌తో పాటు మరో 8 రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ- చెన్నై వందేభారత్‌ రైలు కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణించి చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news