కుక్కలు ఏడ్చినా, మొరిగినా ఆ ఆపదలు తప్పవా?

-

మాములుగా ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకుంటారు..ఇక ఊరిలో కూడా కుక్కలు ఉండటం మనం చూస్తూనే ఉంటాము..అయితే వాటికి విశ్వాసం ఎక్కువ అందుకే కుక్కలను బాగా చూసుకుంటారు. ప్రతీ ఇంట్లో కాకపోయినా వాడకు, గ్రామానికి ఇలా చాలా కుక్కలు ఉంటాయి రాత్రిళ్లు ఎవరైనా దొంగతనానికి వచ్చిన వెంటనే అవి అలర్ట్ చేస్తాయి.అవి మనకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే చాలా మందికి కుక్కలు అంటే అమితమైన ప్రేమ.అలాగే పోలీసులు కూడా కుక్కలన ఉపయోగించే నేరస్తులను పట్టుకుంటారు. ఎంత పెద్ద నేరగాళ్లనైనా కుక్కలు వాసన పసిగట్టి పట్టుకోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాము.

 

అలాంటి కుక్కలు ఒక్కోసారి మూలుగుతూ ఉంటాయి.. లేదా ఒక విధంగా అరుస్తాయి..అలా కుక్కలు అరవడం వల్ల ఏదైనా ఆపదలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చుద్దాము..కుక్కలు మూలిగినా, ఏడ్చినా యమ ధర్మరాజు వస్తున్నట్లుగా భావిస్తారు చాలా మంది. కుక్కలు వాసన చూసి ఎలా చోరులను గుుర్తిస్తాయో… అలానే మానవులకి కనిపించని అనేక దివ్య, దుష్ట శక్తులు కుక్కలకు కన్పిస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలా సార్లు చాలా చోట్ల మరణాల సంభవించాయి. అందుకే కుక్కలు ఏడుస్తుంటే వాటిని తరిమి కొడ్తుంటారు.

వాటికి ఏమైందోనని పదే పదే బయటకు వచ్చి చూస్తుంటారు. అంతేనా వాటిని తమ ఇంటి వద్ద, వాడకట్టు వద్ద ఏడవనీయకుండా చాలా జాగ్రత్తలు తీస్కుంటారు.ప్రకృతి లో జరిగే వైపరీత్యాలతో పాటు మానవుడు గుర్తించలేని వాటిని ఎనన్నో కుక్కలు గుర్తిస్తాయి. చెప్పటానికి కుక్కలకి మాట లేదు. ఈ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమ్మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే భగవంతుడు అన్నీ జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించాడు. కానీ మనిషికే భూమ్మీద విలువ ఎక్కువగా ఉంటుంది.వీలైనంత వరకూ కుక్కలను ఏడవకుండా చూసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news