ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ వేరే లెవల్!

-

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘హైవే’. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానస నటిస్తున్నారు. కేవీ గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ఓటీటీ ‘ఆహా’లో నేరుగా విడుదల కానుంది. ఈ క్రమంలో మంగళవారం చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. హీరో నాగశౌర్య ట్రైలర్ లాంచ్ చేశాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉండబోతుంది.

హైవే-ఆనంద్ దేవరకొండ
హైవే-ఆనంద్ దేవరకొండ

వరుస హత్యలతో ప్రజలను భయపెడుతోన్న ఓ సైకో కిల్లర్ అనే న్యూస్‌తో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ లుక్ కూడా కొత్తగా కనిపిస్తోంది. యాక్టింగ్ కూడా ఇరగదీశాడు. ఈ సినిమా ఆనంద్ ఒక ఫోటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడు.

ఆనందర్ మానసను ప్రేమిస్తాడు. వీరి లవ్ స్టోరీ మధ్యలో ‘డీ’ అనే సైకో కిల్లర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగగింది? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది? సైకో కిల్లర్ ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? వాటి హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ సినిమా చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news