Mahesh Babu: దీనిమ్మ మాస్ ఏమున్నాడు.. మహేష్ బాబు స్టన్నింగ్ లుక్ వైరల్…!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు తమ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.

ఇక సిక్స్ ప్యాక్ తో హీరోలు ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే వారు అలా సిక్స్ ప్యాక్ లు చేయడం వెనుక చాలా కృషి ఉంటుంది. ప్రత్యేక ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి ట్రైనర్లను పిలిపించుకుంటారు. అలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలకు ట్రైనర్ గా వ్యవహరించిన వారిలో లాయిడ్ స్టీవెన్స్ ఒకరు.

ఆయన గతంలో తారక్ కు ఫిట్నెస్ కోచ్ గా వ్యవహరించారు. అయితే తాజాగా మహేష్ బాబుకు ట్రైనర్ గా వ్యవహరించనున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అందుకు బలం చేకూర్చేలా లావిడ్ స్టీవెన్స్, మహేష్ బాబుతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాయిడ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. మహేష్ బాబుతో హాలీవుడ్ స్టీవెన్స్ దిగిన ఫోటోపై పలువురు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news