అందంలో రెండు రకాలు ఉంటాయి. సహజత్వ అందం , కొని తెచ్చుకునే అందం. ఇందులో చాలా మంది కొని తెచ్చుకునే అందానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తూ రసాయనిక క్రీములు ముఖానికి పట్టించి తాత్కాలిక సౌందర్యం పొందటమే కాకుండా చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు. పోనీ బ్యూటీ పార్లర్ లలో సహజసిద్ద ఫేస్ ప్యాక్ లు వాడాలంటే జేబులకి చిల్లులు పడటం పక్కా..మరి మీ జేబులు ఖాళీ అవ్వకుండా, రసాయనిక ఫేస్ క్రీముల భారిన పడకుండా ఎలా అందాన్ని కాపాడుకుంటూ మేరుగుపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆరెంజ్ పండు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో శరీరానికి శక్తిని ఇచ్చే ఎన్నో గుణాలు ఉంటాయి. కానీ అందాన్ని రెట్టింపు చేసే గుణాలు కూడా ఉంటాయనే విషయం ఎంతమందికి తెలుసు. ఆరెంజ్ పండుపై ఉండే తొక్క తో చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ఎలా అంటే…
ఆరెంజ్ పండు తీసుకుని దానిపై తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి.
ఇలా పొడిగా వచ్చిన మిశ్రమాన్ని ఎన్నో రకాలుగా వివిధ పదార్ధాలు కలపడం ద్వారా సౌందర్య సాధనాలని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆరెంజ్ తొక్క పొడిని ఒక స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి, అలాగే రెండు స్పూన్ల పెరుగు తీసుకుని రెండిటిని బాగా కలియబెట్టాలి. ఆ తరువాత ముఖానికి బాగా పట్టించి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా మీ ముఖం మేలిమి ఛాయని పొందుతుంది. అలాగే ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కలతో చేసిన పొడి, ఒక స్పూన్ స్వచమైన పసుపు, తేనే ఒక స్పూన్ తీసుకుని బాగా కలియబెట్టి ముఖానికి పట్టిస్తే జిడ్డుగా ఉండే ఎలాంటి చర్మం అయినా సరే ఎంతో స్వచ్చంగా , ప్రకాశవతంగా మెరుస్తుంది.