సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్న ఒకే ఒక్క తరంగం ఫేస్బుక్.ముందు నుంచి వివాదాలతో ముందు నుంచి కొన్ని సంచలనాలతో సాగిన ఎఫ్బీ కథ ఇవాళ్టికి 18వ పుట్టిన రోజుకు చేరుకుంది.ఇక్కడి నుంచి ఎలా ఉండనుందో ఏంటో? ఎందుకంటే చాలా వివరాలు చాలా విశేషాలు ఫేస్బుక్ కారణంగానే ప్రపంచం నలుమూలల నుంచి వెలుగులోకి వస్తున్నాయి. పత్రికలు వద్దనుకున్న వార్తలను ఫేస్బుక్ లోకి తీసుకువచ్చి, వాటి తీవ్రతను వివరించి, వాటికో గుర్తింపు ఇచ్చింది కూడా ముఖ పుస్తకమే!
ఇవాళ డిజిటల్ జర్నలిస్టులు విపరీతంగా ఉన్నారు.సోషల్ మీడియాను ఆపేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే యుద్ధాలే వస్తున్నాయి.అంతేకాదు సోషల్ మీడియాను ఆపేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా అవేవీ జరగడం లేదు. పాలకుల ఎత్తుగడలేవీ నెగ్గడం లేదు. ఓ విధంగా ఫేస్బుక్ అవకాశాల గని.. విజ్ఞానం మరియు వినోదం ఎవరికి ఏం కావాలో అదే తీసుకుని మిగిలినవి వదిలేయడం బెటర్ .. ఆ విధంగా చూసుకుంటే ఎఫ్బీ చేసిన మేలు..తీసుకువచ్చిన మార్పు ఎంతో!
రాజకీయ, సామాజిక మార్పులకు ఎఫ్బీ ఎంతో కారణం అయింది.ముఖ్యంగా ఔత్సాహిక రచయితలకు, సాహిత్య సమ్మేళనాలకు ఇదొక మంచి ఆధారం అయింది. ఎందరో ప్రతిభావంతులకు ఎఫ్బీ ఒక వేదికగా మారింది.అంతేకాదు చాలా సమస్యలపై పోరాడేందుకు ఎఫ్బీ ఓ అస్త్రంగా మారింది ఎందరికో! మంచితో పాటు చెడు కూడా ఉంది. ఇదేసమయంలో ఎఫ్బీ వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు ఇలా చాలానే నడుస్తున్నాయి.
ఇందులో కొన్ని మోసపోయిన బాపతు ఘటనలు కూడా ఉన్నాయి. సైబర్ నేరాలూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో హ్యాకింగ్ కు అకౌంట్లు గురి అయిన కారణంగా ఇబ్బందులు పడిన ప్రముఖులెందరో! వినియోగదారుల భద్రత దృష్ట్యా ఇంకొన్ని మార్పులు చేస్తేనే ఎఫ్భీకి మునుపటి క్రేజ్ కొనసాగడం ఖాయం లేదంటే ఇబ్బందే! ఎనీవే ఎఫ్బీ నిర్వాహకులు చేయాల్సింది ఎంతో ఉంది.. మరికొన్నేళ్లు ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎఫ్బీ మారనుంది అన్నది మాత్రం సత్యం.